Sunday, 29 May 2011

best kavita in life

అదృష్టమా నీవు ఎక్కడున్నావమ్మా
దురదృష్టంకు నేనంటే చాలా ఇష్టం అంట..
నా ఇష్టానికి విలువనీయక నన్ను వదలదంట..
దానిని సాగనంపి నీకు స్వాగతం పలుకుదాం అని
నిన్ను వెతుకుతూ వెతుకుతూ దారి తప్పానమ్మ..
నన్ను నన్నుగా వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావా..
నువ్వు లేకున్నా దురదృష్టం పోరు నేను పడలేనమ్మ..
ఒక్క అడుగు ముందుకువేస్తే నాలుగడుగులు వెనక్కు తోస్తుందమ్మ..
నిన్ను చేరే మార్గం తెలియక అలిసిపోయానమ్మ..
నన్ను వెతుకుతూ నీవు వస్తావనే ఆశ కూడా పోయిందమ్మా..
ఏమీతోచని నన్ను చూసి ఎగతాళి చేయ్యకమ్మ..
నాపై దయ ఉంచి నిన్ను చేరే మార్గము చూపవా..!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team