Saturday, 22 October 2011

నన్ను నన్నుగా


నన్ను నన్నుగా నచ్చిన నువ్వే ఎప్పటికి నా నవ్వు,
కాదనలేను నేను, ఔననలేవు నువ్వు,
మదనపడే నాకు చిరునవ్వు తోడయ్యేను,
నువ్వు నువ్వుగా నను చేరే రోజున పసిడి పువ్వై పూసెదను...!!! 


మదిలోన విరిసేను ముద్ద మందారం
పెదవులపై మురిసేను సిరిమల్లి సింగారం,
కనులలో కదలాడెను కన్నె కనకాంబరం,
తనువున మెరిసేను పచ్చటి బంగారం,
తీయటి తలపుల కొలువు మనసే మందిరం....

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team