Saturday, 22 October 2011

జీవితం ఒక తెల్ల కగితమైతే


జీవితం ఒక తెల్ల కగితమైతే 
కాకూడదు ప్రేమ ఒక నల్ల చుక్క 
కావాలి ఆ చుక్క ఒక మల్లె మొగ్గ 
విరపూసి వెదజల్లాలి చక్కటి సువాసన 
విహరించాలి ఆకాశ వీధిలో పరిమళ పుస్తకమై...!!!    

కవితకే ఒక కవిత కావాలని కోరుకునే కవి కాని కవిని కలవాలని
కలకాలం కోరుకుని కలలో నివసిస్తూ కాలం కడలిలో కలిసిపోవుటకు సిద్దమైన 
కవి కాని కవయిత్రిని నేను కలవరపడుతున్నా కనికరం లేకపోవటం ఎంత దురదృష్టకరం......

మదిలోని ఆశలకు మాటలు వస్తే,
తీయనైన పాటలతో రాతినైన కరిగించునేమో కదా....!!!!

ఆశల కడలిలో ఉసులాడే మనసుకు,
అలుపెరుగని తోడు దొరికితే, 
ఉరకలు వేయదా పరువము ఆనంద కేరింతలతో...!!!

సూర్యుడిని చూడలేము ప్రకశించునప్పుడు,
ఎందుకు కనపడును  సుందరముగా సూర్యుడు సుర్యాస్తమయమున,
వెళ్లి పోతాడు అని తెలిసి ఎందుకు ఈ పులకింత.....???!!


మనసా ఎందుకు ఈ ఆనందం, ఆరాటం,
ఏమిటి ఈ తెలియని అమాయకత్వం,
ఏ మదికి అర్థమగునో నీ మనస్తత్వం....

మనసా ప్రేమంటే తెలుసుకో,
జీవితాన్ని ఆనందంగా మలుచుకో,
మదిలోని భావనలను అర్థం చేసుకో,
నీకు నచ్చిన వారి హృదయాన నిలిచిపో,
నీ మది మేచిన వారి ప్రేమను ఎప్పటికైనా అందుకో....!!

No comments:

Post a Comment

thanks for comment

by tipsandsms Team